welcome to u
we create some thing for u

News

stay tune
devotion
gopi on 06/23/2016 at 3:20pm (UTC)
  ఇప్పుడు ఏం జరిగినా ‘‘సనాతన ధర్మం ముందే చెప్పింది’’ అనవచ్చునేమో! అష్టాదశ (18) పురాణాల్లో ఒకటైన శ్రీమద్భాగవతం చెప్పిన 15 అంశాలు ఇప్పుడు నిజమవుతున్నాయనిపిస్తోంది. కలియుగం ఎలా ఉంటుందో ఈ పురాణం ఎలా వివరించిందో చూడండి!

శ్లోకం : 12.2.1
మతం, నిజాయితీ, పరిశుభ్రత, సహనం, దయ, జీవించే కాలం, శారీరక బలం, జ్ఞాపక శక్తి కలియుగంలో రోజు రోజుకూ క్షీణిస్తాయి. శక్తిమంతమైన కలి ప్రభావమే దీనికి కారణం.

శ్లోకం : 12.2.2
వ్యక్తి గుణగణాలను, ప్రవర్తనను అదృష్టాన్ని నిర్ణయించేది అతనికిగల సంపదే. అధికారంలో ఉన్నవారికే న్యాయం దక్కుతుంది.

శ్లోకం : 12.2.3
స్త్రీ, పురుషులు పైపై ఆకర్షణల కారణంగానే కలిసి ఉంటారు. వ్యాపార విజయానికి మోసమే ఆధారం అవుతుంది. శృంగార సామర్థ్యం ఆధారంగానే స్త్రీత్వాన్ని, పురుషత్వాన్ని నిర్ణయిస్తారు. కేవలం జంధ్యం మాత్రమే ఓ వ్యక్తి బ్రాహ్మణుడని గుర్తించే సంకేతంగా ఉంటుంది.

శ్లోకం : 12.2.4
వ్యక్తి ఆధ్యాత్మిక స్థితిని కేవలం అతని వద్ద పైకి కనిపించే గుర్తుల ఆధారంగానే గుర్తిస్తారు. వాటి ఆధారంగానే ఒక ఆధ్యాత్మిక విధానం నుంచి మరోదానికి మారుతూ ఉంటారు. సరైన సంపాదన లేని వ్యక్తి యోగ్యతపై తీవ్ర ప్రశ్నలు ఎదురవుతాయి. పదాల పడికట్టులో నైపుణ్యం ఉన్నవాళ్ళను పండితుడంటారు.

శ్లోకం : 12.2.5
డబ్బు లేని వ్యక్తిని అపవిత్రుడంటారు. కపటం, మాయ ఉన్న వ్యక్తులను సుగుణాల రాశి అంటారు. నోటి మాటలతోనే పెళ్ళిళ్ళు చేసుకుంటారు. కేవలం స్నానం చేసినంత మాత్రానికే బహిరంగంగా కనిపించడానికి అర్హులమైపోయామని జనం భావిస్తూ ఉంటారు.

శ్లోకం : 12.2.6
కొద్ది దూరంలో జలాశయం ఉన్న చోటునే పవిత్ర స్థలంగా భావిస్తారు. సౌందర్యం హెయిర్ స్టయిల్‌పై ఆధారపడి ఉంటుందని అనుకుంటారు. కడుపు నింపుకోవటమే జీవిత పరమార్థం అవుతుంది. మొండిగా వ్యవహరించేవారే నిజాయితీపరులుగా ఆమోదం పొందుతారు. కుటుంబాన్ని పోషించగలిగేవాడు గొప్ప నిపుణుడిగా పేరు పొందుతాడు. కీర్తి కోసమే మత సిద్ధాంతాలను పాటిస్తారు.

శ్లోకం : 12.2.7
భూగోళం అవినీతి జనంతో క్రిక్కిరిసిపోవడంతో సామాజిక వర్గాల్లో బలవంతుడిగా చలామణి అయ్యేవాడే రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకుంటాడు.

శ్లోకం : 12.2.9
ప్రజలు కరవుకాటకాలతో, మితిమీరిన పన్నులతో ఇబ్బందులు పడుతూ ఆకులు, చెట్ల వేళ్ళు, మాంసం, ముడి తేనె, పండ్లు, పువ్వులు, విత్తనాలు తినడాన్ని ఎంచుకుంటారు. అనావృష్టి దెబ్బతో ప్రజలు పూర్తిగా నాశనమవుతారు.

శ్లోకం : 12.2.10
చలి, గాలి, వేడి, వర్షం, మంచు వల్ల ప్రజలు తీవ్రమైన బాధలు అనుభవిస్తారు. ఇది చాలదన్నట్లు జగడాలు, ఆకలి, దాహం, వ్యాధులు, తీవ్రమైన ఆందోళనతో జనం చితికిపోతారు.

శ్లోకం : 12.2.11
కలియుగంలో మనిషి జీవిత కాలం 50 ఏళ్ళు అవుతుంది.

శ్లోకం : 12.3.42
వృద్ధ తల్లిదండ్రులను పిల్లలు ఎంతో కాలం సంరక్షించరు.

శ్లోకం : 12.3.41
కలియుగంలో జనం స్వల్ప విషయాలకే ఒకరిపై మరొకరు విద్వేషం పెంచుకుంటారు. చిల్లర నాణేల కోసమే అయినా విద్వేషం పెంచుకుంటారు. స్నేహ సంబంధాలను విడిచిపెట్టేస్తారు. తమ ప్రాణాలను కోల్పోవడానికైనా సిద్ధపడతారు. తమ సొంత బంధువులను హత్య చేయడానికైనా వెనుకాడరు.

శ్లోకం : 12.3.38
మొరటు మనుషులు దేవుడి పేరుతో విరాళాలు సేకరిస్తారు. సన్యాసి దుస్తులు ధరించి, నియమ, నిష్ఠలతో వ్యవహరిస్తున్నట్లు డంభాలు చెప్పుకుంటూ తమను తాము పోషించుకుంటారు. మతం గురించి తెలియనివారు ఉన్నత పదవుల్లోకి వెళ్తారు. మత సిద్ధాంతాలపై మాట్లాడేందుకు ప్రయత్నిస్తారు.

శ్లోకం : 12.3.36
సంపదను కోల్పోయిన యజమానిని సేవకులు వదిలేస్తారు. ఆ యజమాని సద్గుణాల రాశి అయినప్పటికీ సేవకులు విడిచిపెడతారు. సామర్థ్యం కోల్పోయిన సేవకులను యజమానులు వదిలించుకుంటారు. ఆ సేవకులు వారి కుటుంబాల్లో తరతరాలుగా పని చేస్తున్నప్పటికీ దయ చూపరు. పాలు ఇవ్వని ఆవులను వదిలించుకుంటారు లేదా చంపేస్తారు.

శ్లోకం : 12.3.32
నగరాల్లో దొంగలు యథేచ్ఛగా సంచరిస్తారు. నాస్తికులు ఊహాత్మక అర్థాలు చెప్తూ వేదాలను కలుషితం చేస్తారు. రాజకీయ నేతలు ప్రజలను పీడిస్తారు. పూజారులని, మేధావులని పిలిపించుకునేవాళ్ళంతా తమ పొట్టలకు, మర్మాంగాలకు భక్తులుగా మారుతారు.

 

weather
gopi on 06/19/2016 at 10:41am (UTC)
 mostly cloudy
temperature max 32 min 26
tomorrow t storms.
 

freedom
gopi on 06/14/2016 at 12:15pm (UTC)
  అతి చవకగా...రూ.251కే స్మార్ట్ ఫోన్ అందిస్తామంటూ ఇటీవల సంచలనానికి తెరతీసిన రింగింగ్ బెల్స్ సంస్థ వ్యవహారం గుర్తుందా. కోట్లాదిమంది ఎగబడి మరీ తమ పేర్లను నమోదు చేసుకున్న ఈ వివాదా స్పద ఫోన్లు ఎట్టకేలకు వినియోగదారులను మురిపించేందుకు రడీ అవుతున్నాయి. ఈ నెలలోనే ఆయా ఫోన్లను అందించేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. జూన్ 28వ తేదీ నుంచి తమ ఫ్రీడమ్ 251 స్మార్ట్ ఫోన్లను అందిస్తామని కంపెనీ డైరెక్టర్ మొహిత్ గోయల్ సోమవారం ప్రకటించారు. తమ ఫ్రీడం ఫోన్ల కోసం దాదాపు ఏడు కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని, 30వేలమంది కాఫ్ ఆన్ డెలివరీ కింద తమ పేర్లను నమోదు చేసుకున్నారని తెలిపారు.

రూ.251కే స్మార్ట్‌ఫోన్‌ అందజేస్తానని ప్రకటించి ఆన్‌లైన్‌లో ఆర్డర్లు తీసుకున్న రింగింగ్ బెల్స్ సంస్థ ఈ మేరకు ఈ నెల 28వ తేదీ నుంచి బుకింగ్ చేసిన వారికి స్మార్ట్ ఫోన్లను డెలివరీ చేస్తామని ప్రకటించింది. గత ఫిబ్రవరిలో చేసిన సంస్థ ప్రకటనతో ముప్పై వేల మందికి పైగా ఫ్రీడమ్ 251 ఫోన్లను బుక్ చేశారు. మరో ఏడు కోట్ల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు.

కాగా ప్రపంచంలోనే అతి చౌకగా ఫ్రీడం 251 స్మార్ట్‌ఫోన్ల విక్రయానికి గత ఫిబ్రవరిలో కంపెనీ ఆన్‌లైన్‌లో బుకింగ్‌కు ప్రకటన ఇచ్చింది. రూ.2,500 విలువైన స్మార్ట్ ఫోన్‌ను రూ.251కే అందిస్తున్నాని తెలిపింది. దీంతో ఫోన్ లవర్స్ లో భారీ ఆసక్తి నెలకొంది. కుప్పలు తెప్పలుగా నమోదు చేసుకోవడం, తదనంతర పరిణామాలు వివాదానికి దారి తీశాయి. చివరికి టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ జోక్యం చేసుకుని ఐటి శాఖను కల్పించుకోవాల్సిందిగా కోరారు. ఐటి దాడులు జరిగాయి. అనేక విమర్శలు కూడా వెల్లువెత్తడంతో పాటు కంపెనీ పైన కేసులు నమోదైన సంగతి తెలిసిందే. మరి మరోసారి వివాదానికి తెర తీస్తుందా.. లేక వినియోగదారులను ఆకట్టుకుని మరో సంలచనానికి దారితీస్తుందా? వేచి చూడాల్సిందే.
 

weather
gopi on 06/13/2016 at 2:19pm (UTC)
 The weather condition of Ramannapalem
Temparature:39max 30 min

Partly sunny
 

starting schools
gopi on 06/13/2016 at 2:16pm (UTC)
 The schools are reopened in Talangana state. All the students went schools with bore. The faces are dark.
 

schools
gopi on 06/12/2016 at 2:30pm (UTC)
 In talanga all schoos all schools will reopen tomarrow
 

<-Back

 1 

Continue->

This website was created for free with Own-Free-Website.com. Would you also like to have your own website?
Sign up for free